![]() |
![]() |

స్టార్ మాలో కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన నటి ప్రేరణ. కన్నడ పోరి ఐనా కానీ తెలుగు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఈమె బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా వెళ్ళొచ్చింది. అలాగే ఇష్మార్ట్ జోడిలో కూడా సందడి చేసింది. అలాంటి ప్రేరణ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. "విజనరీ డైరెక్టర్స్ కి కి ఒక విషయం. మీకు స్క్రీన్ ప్రెజన్స్ లో అందంగా కనిపిస్తూ ఎమోషన్స్ ని బాగా పండిస్తూ ఆ రోల్ బలాన్ని చాటి చెప్పే సత్తా ఉన్న నటి కోసం మీరు చూస్తున్నట్టయితే నా పేరును పరిశీలించండి. నన్ను కేవలం బిగ్ బాస్ ఫైనలిస్ట్ గా కాకుండా అంతకంటే ఎక్కువ విలువలు ఉన్న మహిళగా, సవాళ్లు ఎదుర్కునే స్త్రీగా, అంతః సౌందర్యంతో ఉండే అమ్మాయిని. ఒక్క అవకాశం ఇస్తే ఆమె తానేంటో నిరూపించుకుంటుంది" అంటూ వన్ ఛాన్స్ అంటూ ఒక పోస్ట్ పెట్టింది.

ప్రేరణ కన్నడలో "చూరికట్టే" అనే మూవీలో నటించింది. తర్వాత ఆయన, పెంటగాన్, ఫిజిక్స్ టీచర్ వంటి మూవీస్ లో కూడా నటించింది. కన్నడ మినీ బిగ్ బాస్ సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా వెళ్ళింది. ఇక ఈమె శ్రీపాద్ ని వివాహం చేసుకుంది. కొన్ని వరకు ప్రేరణ మాత్రమే బుల్లితెర షోస్ లో కనిపించేది కానీ తర్వాత తనతో పాటు తన భర్తను కూడా షోస్ లో ఇంట్రడ్యూస్ చేసింది. అలా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో వీళ్ళు జంటగా వస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ప్రేరణ మనసు మూవీస్ మీదకు మళ్లింది. మరి డైరెక్టర్స్ ఎవరైనా ఆమెకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.
![]() |
![]() |